Skip to main content
Source
Telugu.News18
https://telugu.news18.com/news/telangana/amid-presidential-poll-the-adr-report-finds-telangana-cm-kcr-among-five-mlas-across-india-with-highest-declared-criminal-cases-bk-mks-1367870.html
Author
M.Balakrishna
Date
City
Hyderabad

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, లోక్ సభ ఎంపీలు మాత్రమే ఓటర్లుగా ఉండే రాష్ట్రపతి ఎన్నికలు (Presidential Elections 2022) ఈనెల 18న జరుగనున్నాయి. ప్రతి ఎన్నికల సందర్భంలో చేసినట్లే ఇప్పుడు కూడా నేతల నేరచరితను (ADR Report)బయటపెట్టాయి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్థలు. ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నికై, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయబోయే వారిపై న‌మోదైన కేసులుకు సంబంధించి ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ తాజాగా ఒక రిపోర్ట్ ను విడుద‌ల చేశాయి. సదరు జాబితాలో ఎక్కువ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న తొలి ఐదుగురిలో తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) పేరు కూడా ఉంది..

దేశంలోనే అత్యధికంగా క్రిమినల్ కేసులు నమోదైన‌ ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో తెలంగాణ సీఏం కేసీఆర్ కూడా ఉన్నారు. ఏడీఆర్,  నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 37 తీవ్రమైన IPC సెక్ష‌న్లు కలిగి ఉన్నాయని వెల్ల‌డించారు.

అత్యధిక క్రిమినల్ కేసులున్న టాప్ ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో కేరళ ఎంపీ డీన్ కురియకోస్ 204 కేసులతో మొద‌టి స్థానంలో ఉన్నారు. 99 పెండింగ్‌ కేసులతో (తమిళనాడు) డీఎంకే ఎంపీ ఎస్‌.కతిరవన్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ ఆజం ఖాన్‌ 87 కేసుల‌తో మూడో స్థానంలో ఉన్నారు. మరో తమిళనాడు ఎమ్మెల్యే ప్రిన్స్‌ జేజీ 73 కేసులతో నాలుగో స్థానంలో ఉండగా, 64 క్రిమినల్ కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు.

ఈ నెల 18న  రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేప‌థ్యంలో ఈ రెండు వాచ్ బాడీలు మొత్తం సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల 4809 అఫిడవిట్‌లలో 4759 అధ్యయనం చేశాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న మొత్తం 4759 మంది ఎంపీలు/ఎమ్మెల్యేలలో 477 మంది అంటే 10% మాత్రమే మహిళలు ప్ర‌తినిధులు ఉండ‌డం గమనార్హం.

ఏడీఆర్ రిపోర్టు ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ పై పెండింగ్ లో ఉన్న కేసుల్లో.. 13 నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన అభియోగాలు (IPC సెక్షన్-506), ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు అడ్డుకోవ‌డం, గాయపరచడానికి ప్ర‌య‌త్నించ‌డానికి సంబంధించిన 4 అభియోగాలు (IPC సెక్షన్-332), హత్య ప్రయత్నానికి సంబంధించిన 3 అభియోగాలు (IPC సెక్షన్-307),ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా గాయపరచడానికి సంబంధించిన 3 ఆరోపణలు (IPC సెక్షన్-324), ఎవరైనా ఒక వ్యక్తి నుండి దొంగతనంగా లేదా దాడి ద్వారా లేదా నేరపూరిత బలాన్ని ఉపయోగించి దొంగతనానికి పాల్పడి, ఆ వ్యక్తికి హాని కలిగించినా లేదా అతని ప్రాణానికి హాని కలిగించినా 'స్నాచింగ్స‌ నేరాలు 3 (IPC సెక్షన్-382) ఉన్నాయి. అంతేకాదు,

మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు సంబంధించిన ఆరోపణలు (IPC సెక్షన్-153A),జీవిత ఖైదు లేదా ఇతర కారాగార శిక్షతో శిక్షార్హమైన నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నించినందుకు శిక్షకు సంబంధించిన 2 ఆరోపణలు (IPC సెక్షన్-511),ప్రజా దుష్ప్రచారానికి దారితీసే స్టేట్‌మెంట్‌లకు సంబంధించిన ఆరోపణలు (IPC సెక్షన్-505),ధ్వంసం చేయడం లేదా తరలించడం మొదలైన చ‌ట్ట‌వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు సంబంధించిన 2 కేసులున్నాయి. ఇంకా

(IPC) సెక్షన్- 435),సంకల్పం, స్వీకరించే అధికారం లేదా విలువైన భద్రత (IPC సెక్షన్-477) యొక్క మోసపూరిత రద్దు, విధ్వంసం మొదలైన వాటికి సంబంధించిన 2 కేసులు, అభియోగాలకు సంబంధించిన అభియోగాలు, జాతీయ సమగ్రతకు విఘాతం కలిగించే వాదనలు సంబందించి 1 కేసు (IPC సెక్షన్-153B)  ఉన్నాయి. అయితే ఈ కేసుల్లో చాలా వ‌ర‌కు తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో న‌మోదైన కేసులు ఎక్కువ ఉన్నాయి.