Source: 
Telugu. asianetnews
https://telugu.asianetnews.com/my-home-care/national/regional-parties-gets-76-per-cent-of-income-from-unknown-sources-says-adr-report-kms-rur81o
Author: 
City: 
New Delhi

 గత ఆర్థిక సంవత్సరం 2021-22లో ప్రాంతీయ పార్టీలకు 76 శాతం ఆదాయం గుర్తు తెలియని వనరుల నుంచే వచ్చిందని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్ (ఏడీఆర్) ఓ నివేదికలో తెలిపింది. 76 శాతం అంటే రూ. 887.55 కోట్లు గుర్తు తెలియని వనరుల నుంచే వచ్చిందని వివరించింది.

ఇలా గుర్తు తెలియని వనరుల నుంచి వచ్చిన ఆదాయ వివరాలు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలోనే అధికంగా వచ్చాయి. 2021-21లో ప్రాంతీయ పార్టీలకు మొత్తం విరాళాలు రూ. 530.70 కోట్లు వచ్చాయి. అందులో రూ. 263.93 కోట్లు అంటే 49.73 శాతం గుర్తు తెలియని వనరుల నుంచే వచ్చిందని ఏడీఆర్ తెలుపుతున్నది.

రూ.20 వేలకు లోపు వచ్చే విరాళాల వివరాలు తెలిసే ఉంటాయి. వీటిని తెలిసిన వనరుల నుంచి వచ్చిన ఆదాయంగా చెబుతారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఆ ఆదాయ వివరాలను ఎన్నికల సంఘానికి తెలియజేస్తారు.

వార్షిక ఆడిట్ రిపోర్టులో రాజకీయ పార్టీలు వాటి ఆదాయాలకు మూలాలను వెల్లడించిన వాటినే గుర్తు తెలియని వనరుల నుంచి వచ్చిన ఆదాయంగా పేర్కొంటారు. 

ప్రస్తుతం రూ. 20 వేలకు లోపు విరాళాలు ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థల వివరాలను రాజకీయ పార్టీలు వెల్లడించాల్సిన అవసరం లేదు. అలాగే, ఎలక్టోరల్ బాండ్‌లు ద్వారా విరాళాలు ఇచ్చే వారి వివరాలు బయటకు రావు.

ఎన్నికల బాండ్ల కొనుగోలు ద్వారా, కూపన్ల అమ్మకం ద్వారా, రిలీఫ్ ఫండ్స్, మిసీలినస్ ఇన్‌కమ్, స్వచ్ఛంద విరాళాలు, మీటింగులు.. మోర్చాల ద్వారా వచ్చే కాంట్రిబ్యూషన్లను గుర్తు తెలియని వనరుల నుంచి వచ్చే ఆదాయంగా ఏడీఆర్ రిపోర్ట్ తెలిపింది.

స్వచ్ఛందంగా విరాళం ఇచ్చే వారి వివరాలు పబ్లిక్ డొమేన్‌లో అందుబా టులో ఉండవు. 

గుర్తు తెలియని వనరుల నుంచి గతేడాది ప్రాంతీయ పార్టీలకు మొత్తం రూ. 887.55 కోట్లు వచ్చాయని, అందులో 93.26 శాతం అంటే రూ. 827.76 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చినట్టు ఏడీఆర్ తెలిపింది. 

కూపన్ల విక్రయం ద్వారా రూ. 38.35 కోట్లు, స్వచ్ఛంద కాంట్రిబ్యూషన్లు (రూ. 20 వేలకు లోపు) రూ. 21.29 కోట్లు ఈ 27 ప్రాంతీయ పార్టీ లకు వచ్చినట్టు నివేదిక వివరించింది. 2021-22లో మొత్తం వచ్చిన ఆదాయం రూ. 1.165.58 కోట్లు అని తెలిపింది.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method