Skip to main content
Date

 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గోదాలో నిలిచిన 2560 మంది అభ్యర్థుల్లో 391 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) నివేదిక పేర్కొన్నది. ఈ నెల 12న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 2560 మంది అభ్యర్థుల అఫిడవిట్లకు సంబంధించిన విశ్లేషణను ఏడీఆర్ విడుదల చేసింది. అన్ని పార్టీలతో పోల్చితే బీజేపీ అభ్యర్థులపైనే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయి. తర్వాత స్థానంలో కాంగ్రెస్, జేడీఎస్‌లు ఉన్నాయి. 224 మంది బీజేపీ అభ్యర్థుల్లో 83 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 59 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏడీఆర్ విశ్లేషించిన అభ్యర్థుల్లో 883 మంది కోటీశ్వరులు ఉన్నారు. వారిలో కూడా బీజేపీయే ముందంజలో ఉన్నది. ఆ పార్టీకి చెందిన 93 శాతం అభ్యర్థులు కోట్లకు పడగలెత్తినవారే కావడం విశేషం. తర్వాత స్థానంలో కాంగ్రెస్ నిలిచింది.