Source
              V6Velugu
          https://www.v6velugu.com/8-parties-got-rs-15000-crore-from-unknown-donors
      
    Date
              City
              New Delhi
          దేశంలోని జాతీయ పార్టీలు పదిహేనేండ్లలో గుర్తుతెలియని దాతలనుంచి ఏటా యావరేజ్‌గా రూ. వెయ్యి కోట్ల మేరకు విరాళాలు సేకరించాయి. 2004–05 నుంచి 2020–21 మధ్య 8 నేషనల్ పార్టీలు కలిపి మొత్తం రూ.15,077.97 కోట్లను సీక్రెట్ డొనేషన్ల రూపంలో సేకరించాయని ఈ మేరకు అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. ఒక్క 2020–21 ఏడాదికి.. 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలకు సీక్రెట్‌గా సమకూరిన నిధులు రూ.690.67 కోట్లు అని ఏడీఆర్తెలిపింది. జాతీయ పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీ, ఎన్సీలు ఉండగా.. ప్రాంతీయ పార్టీల్లో ఆప్, జేడీయూ, మజ్లిస్, టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ తదితర పార్టీలు ఉన్నాయి.
            
    