Source: 
Author: 
Date: 
27.08.2019
City: 

విజయవాడ:ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్‌సీపీ 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. రాష్ట్రంలోని 175 సీట్లలో 103 మంది ఎమ్మెల్యేలు 59 శాతం ఓట్లతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

వైఎస్ఆర్‌సీపీ దెబ్బకు రాష్ట్రంలో టీడీపీ కుదేలైంది. ఆ పార్టీ కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పడిపోయింది. కుప్పం అసెంబ్లీ స్థానంలో ఒకానొక దశలో చంద్రబాబునాయుడు ఒక రౌండ్ లో వెనుక పడిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు ఈ ఎన్నికల ఫలితాలకు నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు.

కడప జిల్లాలోని పులివెందుల నుండి పోటీ చేసిన వైఎస్ జగన్ కు అత్యధికంగా 73.5 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానాన్ని ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నుండి అన్నా రాంబాబు భారీ ఓట్ల తేడాతో విజయం సాధించారు. అన్నా రాంబాబుకు 67.9 శాతం ఓట్లు వచ్చాయి. అన్నా రాంబాబు తర్వాతి స్థానాన్ని అంజద్ బాషా కైవసం చేసుకొన్నాడు.అంజద్ బాషాకు 62.9 శాతం ఓట్లు దక్కాయి.

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 14 మంది మహిళలు విజయం సాధించారు. మహిళలంతా 40 శాతం ఓట్ల తేడాతో తమ ప్రత్యర్ధులపై నెగ్గి అసెంబ్లీలో అడుగుపెట్టారు.కర్నూల్ జిల్లాలోని పత్తికొండ అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి శ్రీదేవి 59.8 శాతం ఓట్లతో విజయం సాధించింది.ఈ స్థానం నుండి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యామ్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశాడు. శ్యామ్ ఈ ఎన్నికల్లో కేవలం 24.9 శాతం ఓట్లను మాత్రమే దక్కించుకొన్నాడు.

96 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా ప్రకటించారు. వీరిలో 61 మంది విజయం సాధించారు. క్రిమినల్ కేసులున్నట్టుగా ప్రకటించినా విజయం సాధించిన వారిలో 8 మంది 20 శాతంపైగా ఓట్ల మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో 71 శాతం మంది ఎమ్మెల్యేలు 41 శాతం ఓట్లతో విజయం సాధించారు. వైఎస్ఆర్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు విజయం సాధిస్తే 53 మంది ఎమ్మెల్యేలు 36 శాతం ఓట్లతో గెలుపొందారు.

టీడీపీకి ఈ ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ పార్టీ గెలుపొందిన 23 సీట్లలో 17 స్థానాల్లో ఆయా అసెంబ్లీ స్థానాల్లో పోలైన ఓట్లలో 74  శాతం ఓట్లతో ఆ పార్టీ అభ్యర్ధులు అసెంబ్లీలో అడుగుపెట్టారు. జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాద్ కు 50 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

రాష్ట్రంలోని 163 మంది ఎమ్మెల్యేలలో 98 మంది కోటీశ్వరులు. వీరంతా 50 శాతానికి పైగా ఓట్లతో గెలుపొందారు. ఏడుగురు ఎమ్మెల్యేలు రెండువేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏడీఆర్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method