Skip to main content
Date

 బిజెపి ఆదాయం గత రెండేళ్ళలో సుమారు 81.18 శాతానికి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆదాయం మాత్రం 14 శాతానికి పడిపోయింది ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ప్రకటించింది.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై బిజెపి అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి ఆదాయం క్రమంగా పెరుగుతూ వచ్చిందని ఏడిఆర్ నివేదికలో స్పష్టం చేసింది.

ఏడిఆర్ నివేదిక ప్రకారంగా రూ.1,034.27 కోట్లుగా ఉన్నట్టుగా ఎన్నికల సంఘానికి బిజెపి తెలిపింది.అయితే అంతకు ముందు బిజెపి ఆదాయం దీని కంటే రూ.463.41 కోట్ల ఆదాయంగా ఉంది. 2016-17 సంవత్సరానికి గాను ఇతరత్రా అవసరాల కోసం పార్టీ సుమారు రూ. 710.057 కోట్లు ఖర్చు చేసిందని బిజెపి ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో ప్రకటించింది.

BJP income jumps 81% to Rs 1,034 crore, Congress’ dips 14%, shows report

కాంగ్రెస్ పార్టీకి లభించిన ఆదాయం కంటే రూ.96.30 కోట్లు ఎక్కువగా ఖర్చు చేసింది. పార్టీ ఖర్చు కింద రూ.321.66 కోట్లుగా ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ నివేదికను సమర్పించింది. దేశంలో ఏడు జాతీయ పార్టీలు సుమారు రూ.1,559.17 కోట్లు ఆదాయాన్ని సంపాదించాయి. పార్టీ ఖర్చుల నిమిత్తం కోసం రూ.1,228.26 కోట్లు ఖర్చు చేశాయని ఏడీఆర్ నివేదికను విడుదల చేసింది.

పార్టీల మొత్తం ఆదాయంలో స్వచ్ఛంద విరాళాల కిందే రూ.1,169.07 కోట్లు వచ్చాయని వెల్లడించింది. ఈ పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు ఉన్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!