Skip to main content
Source
Telugu News
Date

Corporate Donation To Parties :  దేశంలో జాతీయపార్టీలకు విరాళాలు గణనీయంగా పెరిగాయి. కార్పొరేట్‌, వ్యాపార సంస్థలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు రూ.921.95 కోట్లు విరాళంగా ఇచ్చాయి. ఇందులో అత్యధికంగా రూ.720.40 కోట్లు బీజేపీ పొందింది. 2017-18 నుంచి 2018-19 ఏడాదికి కార్పొరేట్ల విరాళాలు 109 శాతానికి పెరిగాయని అసోసియేషన్​ ఆఫ్​ డెమోక్రటిక్​ రీఫార్మ్స్​ (ADR​)తెలిపింది.

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కన్నా ఎక్కువ విరాళాలు ఇచ్చిన దాతల గురించి భారత ఎన్నికల కమిషన్‌ కు(ECI)పార్టీలు ఇచ్చిన వివరాల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) విశ్లేషణ చేసింది. 5 జాతీయ పార్టీల్లో బీజేపీ 2,025 కార్పొరేట్‌ దాతల నుంచి రూ.720.40 కోట్ల విరాళాలు పొందింది. గతంలో 2016-17‌కు గానూ బీజేపీ రూ.532 కోట్లు దక్కించుకోగా.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ రూ.785.77 కోట్లు విరాళాలు అందినట్లు ప్రకటించింది. కాగా, ఇప్పుడు 2019-20 ఏడాదిలో స్వల్పంగా తగ్గి రూ.720.40 కోట్ల విరాళాలు అందాయి.

ఈ విషయంలో రెండో స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. 2019-20 ఏడాదికి కాంగ్రెస్​ పార్టీకి వచ్చిన విరాళాలు రూ.133.04కోట్లు, ఎన్సీపీకి రూ.57.086 కోట్లుగా ఉన్నాయి. కాగా,సీపీఎంకు ఎలాంటి కార్పొరేట్ ఫండ్స్ రాలేదని ఏడీఆర్​ వెల్లడించింది. కాగా అత్యధిక విరాళాలు ఇచ్చిన కంపెనీగా ఫ్రడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నిలిచింది. ఈ సంస్థ బీజేపీ, కాంగ్రెస్ కు కలిపి రూ.247 కోట్లు విరాళాలు అందించింది.