Skip to main content
Source
Telugu.hashtagu.in
https://telugu.hashtagu.in/india/adr-report-says-76-percent-of-regional-parties-income-last-year-came-from-unknown-sources-141546.html
Author
Pasha
Date

2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలు(Regional Parties Income) ఆర్జించిన మొత్తం ఆదాయం రూ.1,165.58 కోట్లలో 76 శాతం (రూ. 887.55 కోట్లు) గుర్తు తెలియని మూలాల నుంచే అందిందని పేర్కొంది.

ప్రాంతీయ పార్టీలకు వచ్చే ఆదాయం, విరాళాలపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) కీలక సమాచారంతో కూడిన నివేదికను రిలీజ్ చేసింది. వాటికి వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం గుర్తు తెలియని వనరుల ద్వారా సమకూరిన విరాళాల రూపంలో ఉంటోందని వెల్లడించింది. ప్రత్యేకించి 2021-22 ఆర్థిక సంవత్సరంలో
ప్రాంతీయ పార్టీలు(Regional Parties Income) ఆర్జించిన మొత్తం ఆదాయం రూ.1,165.58 కోట్లలో 76 శాతం (రూ. 887.55 కోట్లు) గుర్తు తెలియని మూలాల నుంచే అందిందని పేర్కొంది. ఇక ఇందులోనూ 93 శాతం విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూరాయని తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020-21)లో ప్రాంతీయ పార్టీలకు(Regional Parties Income) మొత్తం విరాళాలు రూ. 530.70 కోట్లు వచ్చాయి. ఇందులోనూ 49.73 శాతం (రూ.263.93 కోట్లు) విరాళాలు గుర్తుతెలియని వనరుల నుంచే వచ్చాయని ఏడీఆర్ విశ్లేషించింది.

“కంట్రిబ్యూషన్ రిపోర్ట్” .. వార్షిక ఆడిట్ రిపోర్టును 

రూ.20వేలకు పైబడి వచ్చే విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే సమాచారం అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఆ ఆదాయ వివరాలను రాజకీయ పార్టీలు “కంట్రిబ్యూషన్ రిపోర్ట్” లో ఎన్నికల సంఘానికి ఏటా తెలియజేస్తాయి. ఇక గుర్తు తెలియని వనరుల నుంచి వచ్చిన ఆదాయ వివరాలతో (సోర్స్ వివరాలు చెప్పకుండా) వార్షిక ఆడిట్ రిపోర్టును ఎన్నికల సంఘానికి సమర్పిస్తాయి. రూ. 20 వేలకు లోపు విరాళాలు ఇచ్చిన వారి వివరాలను, ఎలక్టోరల్ బాండ్‌ల ద్వారా వచ్చిన విరాళాల సమాచారాన్ని పార్టీలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 27 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ. 1,165.58 కోట్లు కాగా, ఇందులో తెలిసిన దాతల నుంచి వచ్చిన ఆదాయం రూ. 145.42 కోట్లు (12.48 శాతం) గా ఉంది.