Skip to main content
Source
Telugu Hindustan Times
https://telugu.hindustantimes.com/national-international/megha-engineering-sii-in-top-list-of-corporates-in-political-funding-through-electoral-trusts-121704359389459.html
Author
Sharath Chitturi
Date

Electoral trust funds : 2022-23 ఏడాదిలో ఎలక్టోరల్​ ట్రస్ట్​లకు వచ్చిన విరాళాల్లో 70శాతం బీజేపీకే వెళ్లింది! హైదరాబాద్​కు చెందిన ఓ సంస్థ.. అత్యధిక డబ్బులు విరాళాలుగా ఇచ్చింది.

Electoral trust funds : 2022-23 ఏడాదిలో ఎలక్టోరల్​ ట్రస్ట్​ల ద్వారా ఎవరు, ఏ పార్టీకి, ఎంత ఇచ్చారు? అన్న విషయంపై ఓ రిపోర్టును రూపొందించింది ఏడీఆర్​ (అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​). హైదరాబాద్​కు చెందిన మేఘా ఇంజినీరింగ్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సంస్థ అత్యధికంగా రూ. 87 కోట్లు ఇచ్చింది. రెండో స్థానంలో.. రూ. 50.25 కోట్ల విరాళంతో సీరిన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా నిలిచింది.

తమ దగ్గరకు వచ్చే విరాళాలను రాజకీయ పార్టీలకు పంచే వ్యవస్థే ఈ ఎలక్టోరల్​ ట్రస్ట్​. 2022- 23లో ఎలక్టోరల్​ ట్రస్ట్​లకు వెళ్లిన 90శాతం నిధుల్లో టాప్​ 10 కార్పొరేట్స్​ వాటా 90.66శాతంగా ఉంది. ఈ నిధులన్నీ ప్రుడెంట్​ ఎలక్టోరల్​ ట్రస్ట్​కు వెళ్లాయి. కాగా.. 39 కార్పొరేట్లు, వ్యాపారాలు.. ఎలక్టోరల్​ ట్రస్ట్​లకు రూ. 363.71 కోట్లు ఇచ్చాయి. 34 ఎంటిటీలు రూ. 360.46 కోట్లు ఇచ్చాయి. మిగిలినవి సమాజ్​ ఎలక్టోరల్​ ట్రస్ట్​ (రూ. 2కోట్లు), పరిభర్తన్​ ఎలక్టోరల్​ ట్రస్ట్​ (రూ. 75.50లక్షలు), ట్రయంఫ్​ ఎలక్టోరల్​ ట్రస్ట్​ (రూ. 50లక్షలు)లోకి వెళ్లాయి. 11మంది స్వతంత్రులు కూడా ఈ ట్రస్ట్​లకు డబ్బులిచ్చారు.

BJP Electoral trust funds : ఇక 2022-23లో ప్రూడెంట్​ రూపంలో బీజేపీకి రూ. 256.25 కోట్లు వెళ్లాయి. 2021-22లో ఇది రూ. 336.50 కోట్లుగా ఉండేది. బీజేపీతో పాటు బీఆర్​ఎస్​, వైఎస్​ఆర్​ కాంగ్రెస్​, ఆప్​నకు కూడా ఇక్కడి నుంచి నిధులు వెళ్లాయి. ఇక సమాజ్​ నుంచి బీజేపీకి రూ. 1.50 కోట్లు వెళ్లగా.. కాంగ్రెస్​కు రూ. 50లక్షలు అందాయి.

ఎలక్టోరల్​ ట్రస్ట్​ల ద్వారా రాజకీయ పార్టీలకు వెళ్లిన మొత్తం నిధుల్లో 70.69శాతం (రూ. 259కోట్లు) వాటా బీజేపీదే ఉంది. బీఆర్​ఎస్​కు రూ. 90కోట్లు వచ్చాయి. కాంగ్రెస్​, వైఎస్​ఆర్​ కాంగ్రెస్​, ఆప్​నకు​ మొత్తం కలిపితే రూ. 17.40కోట్లు వెళ్లాయి.

2022-23లో తమకు ఎలాంటి విరాళాలు రాలేదని 13 ఎలక్టోరల్​ ట్రస్ట్​లలో 8మంది వెల్లడించాయి. 2013-14 నుంచి 2022-23 వరకు తమకు అసలు విరాళాలే రాలేదని 2 ట్రస్ట్​లు తెలిపాయి. మరో రెండు ట్రస్ట్​లకు రిజిస్ట్రేషన్​ దశ నుంచే డబ్బులు రాలేదట. 4 ట్రస్ట్​లకైతే కేవలం ఒక్కసారే విరాళాలు అందాయి.

Megha Engineering electoral trusts funding : ఏ ట్రస్ట్​కు ఎంత విరాళాలు వచ్చాయి? అన్నది ఎలక్షన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియాకు చెప్పాల్సి ఉంటుంది. అనంతరం ఆ వివరాలు.. వెబ్​సైట్​లో కనిపిస్తాయి. అయితే.. నిర్దిష్ట గడువు దాటినా.. 2022-23లో వచ్చిన విరాళాలకు సంబంధించి 5 ట్రస్ట్​ల వివరాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. అవి.. జన్​ప్రగతి, జన్​జీత్​, స్మాల్​ డొనేషన్స్​, జైహింద్​, భారతీయ భూమి ఎలక్టోరల్​ ట్రస్ట్​లు.

ఈ ఎలక్టోరల్​ ట్రస్ట్​లు ఎవరు స్థాపించారు? అన్న వివరాలు ఉండవు. పారదర్శకత కోసం వారి పేర్లను కూడా అందుబాటులో ఉంచాలని ఏడీఆర్​ విజ్ఞప్తి చేస్తోంది. కాగా.. ఏ పార్టీకి ఎంత విరాళంగా ఇచ్చారు? అన్న వివరాలను కార్పొరేట్​ సంస్థలు తమ వార్షిక రిపోర్టుల్లో పొందుపరచాలని పేర్కొంది.