Skip to main content
Source
Telangana Thefederal
Author
The Federal
Date

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగు దేశాల నేతలు హాజరవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న నేతలెవరు? ఆదివారం విచ్చేస్తున్నదెవరు?

నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 9వ తేదీ ఆదివారం రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పలువురు దేశాధినేతలు హాజరవుతున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇప్పటికే న్యూఢిల్లీ చేరుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవులకు చెందిన మహమ్మద్ ముయిజ్జు, భూటాన్‌కు చెందిన మహ్మద్ ముయిజ్జు, నేపాల్‌కు చెందిన పుష్పకమల్ దహల్ 'ప్రచండ', మారిషస్‌కు చెందిన ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ ఉన్నారు. ఈ వేడుకకు సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్ కూడా హాజరుకానున్నారు. అఫీఫ్ శనివారం దేశ రాజధానికి చేరుకోనుండగా, మిగతా నేతలు ఆదివారం రానున్నారు.

విందు కూడా..

"వివిధ దేశాల నుంచి వచ్చిన దేశాధినేతలు, అతిథులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు రాత్రి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందుకు హాజరవుతారు.

విడివిడిగా సమావేశాలు..

రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి 7:15 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిశాక మోదీ వివిధ దేశాధినేతలతో విడివిడిగా సమావేశం కానున్నారు.

భారతదేశం, మాల్దీవుల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో ముయిజును ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గతేడాది నవంబర్‌ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన ముయిజ్జు.. చైనా అనుకూల విధానాలను అవలంబిస్తూ.. భారత్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే భారత్‌ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని షరతు విధించారు. ఈమేరకు మే 10 నాటికి మొత్తం 88 మంది ఆర్మీ సిబ్బంది అక్కడినుంచి వచ్చేశారు. మరోవైపు మాల్దీవుల్లో చేపడుతున్న పరిశ్రమలు, నిర్మాణ ప్రాజెక్టుల కోసం ముయిజ్జు చైనా వైపే మొగ్గు చూపుతున్నారు.