Skip to main content
Source
10TV
https://10tv.in/national/dk-shivakumar-india-richest-mla-has-assets-worth-rs-1400-crore-673571.html
Date

కర్ణాటక ఎమ్మెల్యే కేహెచ్‌ పుట్టస్వామి రూ.1,267 కోట్ల విలువైన ఆస్తులతో రెండో స్థానంలో, అదే రాష్ట్రానికి చెందిన..

Richest MLA – DK Shivakumar: దేశంలో అత్యంత ధనిక, అత్యంత పేద ఎమ్మెల్యేలు ఎవరో తెలుసా? ఈ వివరాలనే ప్రజాస్వామ్య సంస్కరణల సమాఖ్య (ADR) ప్రకటించింది. ఈ ఏడాది ఎన్నికల సంఘానికి ఆయా నేతలు అఫిడవిట్లు సమర్పించారు. వాటి ఆధారంగా ఏడీఆర్ వివరాలు తెలిపింది. కర్ణాటక (Karnataka) డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ రూ.1,413 కోట్ల ఆస్తులతో అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు.

కర్ణాటక ఎమ్మెల్యే కేహెచ్‌ పుట్టస్వామి రూ.1,267 కోట్ల విలువైన ఆస్తులతో రెండో స్థానంలో, అదే రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే ప్రియ కృష్ణ రూ.1,156 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. కర్ణాటకలో అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న శాసన సభ్యుడు భాగీరథి మురుల్య. ఈ బీజేపీ ఎమ్మెల్సీ ఆస్తులు రూ.28 లక్షలు, అప్పులు రూ.2 లక్షలు. టాప్-20 అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో 12 మంది కాంగ్రెస్‌ నేతలే.

టాప్-10లో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే నిర్మల్‌ కుమార్‌ ధారా ( Nirmal Kumar Dhara ) పేరిట కనీసం రూ.2,000 కూడా లేవట. ఆయనే దేశంలోని అత్యంత పేద ఎమ్మెల్యే. ఆయన మొత్తం ఆస్తులు విలువ రూ.1,700 మాత్రమేనని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఒడిశా ఎమ్మెల్యే ముడులి మొత్తం ఆస్తుల విలువ రూ.15 వేలు మాత్రమే. అలాగే, పంజాబ్‌ ఎమ్మెల్యే నరీందర్ పాల్ సింగ్ వద్ద రూ.18,370 మాత్రమే ఉన్నాయట.