Skip to main content
Source
Telugu.samayam
Author
తిరుమల బాబు
Date

TDP Highest Income 2024-2025 ADR Report: దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఏడీఆర్ కీలక రిపోర్ట్‌ను బయటపెట్టింది. 36 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ. 1,192 కోట్లుగా తెలిపింది. తొలి స్థానంలో టీడీపీ నిలిచించింది.. రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మూడో స్థానంలో వైఎస్సార్‌సీపీ ఉంది.. బీఆర్ఎస్ 4వ స్థానం, జనసేన 7వ స్థానంలో ఉంది. 2024-25 ఆడిట్‌ నివేదికల ప్రకారం ఏడీఆర్‌ వివరాలు వెల్లడించింది. TDP Highest Income 2024-2025 ADR Report: దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఏడీఆర్ కీలక రిపోర్ట్‌ను బయటపెట్టింది. 36 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ. 1,192 కోట్లుగా తెలిపింది. తొలి స్థానంలో టీడీపీ నిలిచించింది.. రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మూడో స్థానంలో వైఎస్సార్‌సీపీ ఉంది.. బీఆర్ఎస్ 4వ స్థానం, జనసేన 7వ స్థానంలో ఉంది. 2024-25 ఆడిట్‌ నివేదికల ప్రకారం ఏడీఆర్‌ వివరాలు వెల్లడించింది. 2024-2025లో 36 ప్రాంతీయ పార్టీలకు రూ.1,192 కోట్ల ఆదాయం రాగా.. వీటిలో రూ.1,433 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాంతీ పార్టీలు వచ్చిన ఆదాయం కంటే రూ.241 కోట్లు (20.13%) ఎక్కువ ఖర్చు చేయడం విశేషం. టీడీపీకి 2024-2025లో రూ.228.31 కోట్ల ఆదాయం వచ్చింది. వీటిలో రూ.120 కోట్లు రుసుము, చందాల రూపంలో వచ్చాయి.. విరాళాలుగా రై.85.20 కోట్లు.. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రూ.23.02 కోట్లు.. అలాగే మరో రూ.0.05 కోట్లు వచ్చినట్లు తెలిపారు. రెండో స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ రూ.219.35 కోట్లతో ఉంది, మూడో స్థానంలో వైఎస్సా్‌సీపీ రూ.140.38కోట్లు, బీఆర్ఎస్ రూ.123.67 కోట్లు, బీజేడీ రూ.110.13 కోట్లు, ఏఐడీఎంకే రూ.86 కోట్లు, జనసేన రూ.64 కోట్లు ఆదాయం వచ్చింది. వైఎస్సార్‌సీపీకి రూ.140.05 కోట్లు విరాళాల రూపంలో, ఐటీ రీఫండ్ రూ.18 లక్షలు, డిపాజిట్లపై వడ్డీగా రూ.14 లక్సలు.. ఇతర మార్గాల్లో రూ.27వేలు వచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్‌కు డిపాజిట్లపై వడ్డీగా రూ.107.96 కోట్లు, చందాలు- రూ.15.09 కోట్లు, ఐటీ రిఫండ్‌పై వడ్డీగా రూ.13 లక్షలు, ఇతర మార్గాల్లో రూ.48 లక్షల ఆదాయం వచ్చింది. జనసేన పార్టీకి మొత్తం రూ.64 కోట్లలో సభ్యత్వ రుసుం కింద రూ.59.62 కోట్లు, డిపాజిట్లపై వడ్డీ కింద రూ.4.48 కోట్లు వచ్చాయి. 2023-24లో 36 పార్టీలకు రూ.2,463.17 కోట్ల ఆదాయం వస్తే.. 2024-25లో రూ.1,192.94 కోట్లకు తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. బీఆర్ఎస్‌కు ఆదాయం రూ.561 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌-రూ.427 కోట్లు, బీజేడీ- రూ.187 కోట్లు, ఆర్‌జేడీ- రూ.72 కోట్లు, టీడీపీకి-రూ.56 కోట్లు, వైఎస్సార్‌సీపీకి-రూ.50 కోట్ల మేర తగ్గింది. ఆసక్తికరంగా అన్నా డీఎంకేకు ఆదాయం రూ.39 కోట్లు, ఎంఎన్‌ఎస్‌-రూ.37 కోట్లు, జనసేన- రూ.24 కోట్లు, జేఎంఎం-రూ.21 కోట్లు, జేడీయూ- రూ.16 కోట్లు, సీపీఐ ఆదాయం రూ.10 కోట్ల మేర పెరిగింది. వైఎస్సార్‌సీపీ 2024-2025లో వైఎస్సార్‌సీపీ రూ.340 కోట్లు, బీజేడీ రూ.288 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ రూ.227 కోట్లు, బీఆర్ఎస్ రూ.180 కోట్లు, సమాజ్‌వాదీ రూ.74 కోట్లు, టీడీపీ రూ.61.33 కోట్లు, జనసేన పార్టీ రూ.56.94 కోట్లు ఖర్చు చేశాయి. ఓవరాల్‌గా ప్రాంతీయ పార్టీల్లో ఆదాయంలో టీడీపీ రూ.228 కోట్లు, ఖర్చులో వైఎస్సార్‌సీపీ రూ.340 కోట్లు తొలి స్థానాల్లో నిలిచాయి.


abc