Skip to main content
Source
Telugu.oneindia
Date

దేశంలోని రాజకీయ పార్టీలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) తాజా నివేదిక వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 40 ప్రాంతీయ పార్టీలు రూ.2,532.09 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయని నివేదికలో పేర్కొంది. ఈ ఆదాయంలో 70 శాతానికి పైగా నిధులు ఎన్నికల బాండ్ల ద్వారానే వచ్చాయని నివేదిక స్పష్టం చేసింది

ఈ రిపోర్టు ప్రకారం.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అత్యధికంగా రూ.685.51 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్‌ నివేదికల ప్రకారం ఈ నివేదికను ఏడీఆర్ రిలీజ్ చేసింది. ప్రాంతీయ పార్టీల వివరాలు చూస్తే.. మొత్తం ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్న ఐదు పార్టీలు మొత్తం ఆదాయంలో 83.17 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇందులో తెలంగాణకు చెందిన భారత్ రాష్ట్ర సమితి (BRS) రూ. 685.51 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.

ImageImage

ఆ తర్వాత టీఎంసీ రూ.646.39 కోట్లు, బీజూ జనతాదళ్ రూ.297.81 కోట్లు , తెలుగుదేశం పార్టీ రూ.285.07, వైఎస్సార్‌ కాంగ్రెస్ రూ.191.04 కోట్ల ఆదాయంతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. 40 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో ఈ ఐదు పార్టీల ఆదాయం వాటా మాత్రమే దాదాపు 83.17 శాతం ఉండటం గమనార్హం. ఇక గత ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే ఈసారి ప్రాంతీయ పార్టీల ఆదాయం ఏకంగా 45.77 శాతం పెరిగింది. ఆ ఏడాది మొత్తం ఆదాయం రూ. 1,736.85 కోట్లుగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. అటు టీడీపీ, బీజేపీ గణనీయమైన ఆదాయ పెరుగుదలను నమోదు చేసినట్లు వెల్లడించింది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ , జనతాదళ్ (యునైటెడ్) సహా 12 పార్టీలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. ఆదాయం కంటే సుమారు 55 శాతం ఎక్కువ ఖర్చులు వైస్సార్‌ కాంగ్రెస్‌ చూపింది. మరోవైపు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయలేదని 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. బీఆర్‌ఎస్‌ ఖర్చు చేయని ఆదాయం రూ.430.60 కోట్లుగా ఉంది.

 


abc