రాజ్యసభ ఎంపీల ఆస్తుల మొత్తం రూ.26,047 కోట్లు కాగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల వాటే రూ.10,079 కోట్లు అని ఏడీఆర్ తెలిపింది. ఇందులో బీఆర్‌ఎస్ ఎంపీ...
రాజ్యసభ ఎంపీల ఆస్తుల మొత్తం రూ.26,047 కోట్లు కాగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల వాటే రూ.10,079 కోట్లు అని ఏడీఆర్ తెలిపింది. ఇందులో బీఆర్‌ఎస్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి రూ.5300 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉన్నారు. రాజ్యసభలో తెలంగాణ ఎంపీల ఆస్తుల మొత్తం రూ.8,130 కోట్లు కాగా.. ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఆస్తుల మొత్తం రూ.1949 కోట్లని వెల్లడించింది. పార్టీలవారీగా చూస్తే రూ.26,047 కోట్లలో బీజేపీ ఎంపీల వాటా రూ.8,181 కోట్లు, బీఆర్‌ఎస్ ఎంపీల వాటా రూ.5,524 కోట్లు అని తెలిపింది. రాజ్యసభలో మొత్తం ఎంపీల సగటు ఆస్తులు రూ.115.25 కోట్లు. రాజ్యసభలో 233 మంది ఎంపీలకు గానూ 226 మంది సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్ బుధవారం నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం రాజ్యసభలో 31 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 9 మంది బిలియనీర్లు తెలుగు రాష్ట్రాల ఎంపీలు. వీరిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. నలుగురు తెలంగాణ ఎంపీలు. బీఆర్‌ఎస్ ఎంపీల సగటు ఆస్తులు రూ.1841.39 కోట్లు అని ఏడీఆర్ తెలిపింది.
ఇవి కూడా చదవండి
